![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -469 లో.. ముకుందనే సరోగసి మదర్ అని మురారి కృష్ణతో చెప్తాడు. దీంతో కృష్ణ రచ్చ రచ్చ చేస్తుంది. మీరా తమ బిడ్డను మోయడం వల్ల ఆదర్శ్‌ని బలిచేస్తున్నామని, ఆదర్శ్ మీరాని ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. ఆ విషయం తెలియగానే మురారి షాక్ అయిపోతాడు. అత్తయ్య కూడా వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయం అత్తయ్య నాతో చెప్పారు. నా నిర్ణయం ఏంటిని నన్ను అడిగింది. మీలాగే నేను ఈ పెళ్లి వద్దు అంటే కారణం అడిగితే ఏం చెప్పాలి. తీగ లాగితే మన డొంక మొత్తం కదులుతుంది. ఇవన్నీ ఆలోచించకుండా ఆవిడ ఏ ఉద్దేశంతో మీ బిడ్డను మోస్తాను అనగానే నాతో ఒక్క మాట చెప్పకుండా ఏం ఆలోచించకుండా ఎలా ఒప్పుకున్నారు ఏసీపీ సార్. జరగబోయేది తలచుకుంటే నా చేతులు వణికిపోతున్నాయి. ఇప్పటికే ఆదర్శ్ నా ముఖం చూడటం లేదు. ముకుంద నా వల్లే చనిపోయిందని నమ్ముతున్నాడు. ఇప్పుడు మీరా కూడా నా వల్లే తనకి దూరం అవుతుందని తెలిస్తే ఇక జన్మలో నన్ను క్షమించడు. మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూస్తున్నారా అని మురారీతో కృష్ణ అంటుంది.
మిగతా వాటిని ఎలా ఆలోచించాలో మనం తర్వాత చూద్దాం.. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన బిడ్డ కోసం కృష్ణ.. తను మీరా కడుపులో పెరుగుతుంది. అన్నీ మర్చిపోయి మీరాని జాగ్రత్తగా చూసుకుందాం అర్థమైందా కృష్ణ అని మురారి అంటాడు. ఇక అందరు కలిసి భోజనం చేస్తారు. అక్కడ ఆదర్శ్, మీరా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. ఆయితే అదర్శ్ వేరే అభిప్రాయంతో నవ్వుతాడు. మీరా వేరే అభిప్రాయంతో నవ్వుతుంటుంది. ఇక మీరాని కృష్ణ పక్కకి తీసుకెళ్ళి.. నీకు కొంచెం అయినా బుద్ధి ఉందా. మనం ఉన్న పరిస్థితి ఏంటో అర్థమవుతుందా. నీ అంతట నువ్వే సరోగసీకి ఒప్పుకొని ప్రాసెస్ మొత్తం పూర్తి అయింది కదా ఇప్పుడు ఈ వేషాలు ఏంటి. కడుపులో బిడ్డను పెట్టుకొని ఆదర్శ్‌లో ఎందుకు ఆశలు రేకెత్తిస్తున్నావని కృష్ణ అనగానే.. ఏంటి కృష్ణ నువ్వు మాట్లాడేది అని మీరా అంటుంది. ఏం తెలీనట్లు మాట్లాడకు మీరా. నీ మనసులో అలాంటి ఆశలు ఉన్నప్పుడు ఎందుకు సరోగసీకి ఒప్పుకున్నావ్. మేం ఏమైనా నీకు అడిగామా. మీ కుటుంబం అంటే ఇష్టం బాధ్యత అని ఏసీపీ సార్‌ని నమ్మించావ్. ఇప్పుడు ఆదర్శ్‌ని చూసి ఆ సిగ్గు పడటం ఏంటి. ఆ నవ్వు ఏంటి. ఆటలుగా ఉందా నీకు అని కృష్ణ కోపంగా అంటుంది.
అయిపోయిందా. ఇప్పుడు నన్నేం చేయమంటావ్. ఎవర్నీ చూసి నవ్వకుండా సిగ్గు పడకుండా నాకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు. నేను కృష్ణ గర్భాన్ని మోస్తున్నాను. కృష్ణకు జీవితంలో పిల్లులు పుట్టరు అని చెప్పాలా. నువ్వు గర్భవతివి కాకుండా ఎవరికి ఏ అనుమానం రాకుండా నటిస్తున్నావ్ కదా. నేను అంతే. అయినా ఆదర్శ్ ఎప్పటి నుంచో నా వెంట పడుతున్నాడు. నేను అంటి ముట్టనట్లు ఉన్నా తను నా వెనకే పడుతున్నాడని మీరా అనగానే.. నీకు ఆదర్శ్ అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత క్లోజ్‌గా ఎందుకు ఉన్నావు. షాపింగ్‌లకు ఎందుకు తిరుగుతున్నావ్. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్లే ఉండాలి కదా. ఆదర్శ్‌తోనే చెప్పొచ్చు కదా. ఆదర్శ్, సంగీతలకు పెళ్లి చేస్తానని మాటిచ్చావు కదా. ఆదర్శ్‌తో క్లోజ్‌గా ఉంటూ మా దగ్గర సరోగసీ తీసుకొని ఏంటి ఈ నాటకాలు మీరా అని కృష్ణ అనగానే.. ముకుందని కోల్పోయిన ఆదర్శ్ కి నో చెప్తే డిప్రెషన్ కి పోతాడని ఇలా చేశానని కవర్ చేస్తుంది. మరోవైపు రేవతి, కృష్ణ, మురారీలని భవాని పిలుస్తుంది. ఆదర్శ్, మీరాల పెళ్ళికి ముహుర్తం పెట్టించు.. పంతులు గారిని పిలువు అని భవాని అనగానే.. ఒక్కసారిగా వద్దని కృష్ణ అరుస్తుంది. ఏంటి ఎందుకు అలా అరిచావని భవాని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |